క్రీడా పోటీల్లో భారతి విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీల్లో భారతి విద్యార్థుల సత్తా

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

కమలాపురం : విజయనగరంలో త్వరలో జరిగే డీఏవీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌ పోటీలకు భారతి విద్యా మందిర్‌ విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ శివ్వం కిషోర్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల విజయవాడలోని ఎన్‌టీటీపీఎస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన డీఏవీ క్లస్టర్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో డీఏవీ భారతి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారని వివరించారు. వారిలో అండర్‌–17 బాలుర విభాగంలో పి.యశ్వంత్‌, షాట్‌పుట్‌లో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. అలాగే 800 మీటర్ల పరుగు పందెంలో ఆదిల్‌, జావలిన్‌త్రో, త్రిపుల్‌ జంప్‌లో ఉదయ్‌ ప్రథమ స్థానం సాధించారని పేర్కొన్నారు. అండర్‌–14 బాలుర విభాగంలో కెవి రుషి డిస్కస్‌త్రోలో ప్రథమ, జావలిన్‌ త్రోలో ద్వితీయ స్థానం పొందారని చెప్పారు. అచ్యుత్‌ 88 మీటర్ల, 200 మీటర్ల, ట్రిపుల్‌ జంప్‌లో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారన్నారు. అండర్‌–17 బాలికల విభాగంలో సాయి హర్షిత జావలిన్‌త్రో, ట్రిపుల్‌ జంప్‌లో ప్రథమ స్థానం, 200 మీటర్లలో ద్వితీయ స్థానం సాధించారన్నారు. తన్విత 1500 మీటర్లు పరుగు పందెంలో ప్రథమ, 400 మీటర్లలో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. మమత షాట్‌పుట్‌, డిస్కస్‌త్రోలో తృతీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. అలాగే అండర్‌–14 బాలికల విభాగంలో బి.తేజశ్రీ డిస్కస్‌త్రోలో ప్రథమ, అశ్లిత జావలిన్‌ త్రోలో ప్రథమ, ట్రిపుల్‌ జంప్‌లో ద్వితీయ, రవిత్రేణి 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించారని తెలిపారు. అండర్‌–17, అండర్‌–14 బాలుర చెస్‌ విభాగంలో కౌశిక్‌, రామ్‌ చరణ్‌, లోహితేశ్వ చక్రధర్‌, లవిత్‌, చేతన్‌, చార్వీక్‌, చైతన్య రన్న్‌ర్స్‌గా నిలిచారని వివరించారు. కాగా ఈ పోటీల్లో గెలుపొందిన విజేలందరూ త్వరలో విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్లాంట్‌ హెడ్‌ రామమూర్తి, హెచ్‌ఆర్‌ గౌరీ పరమేశ్వర రావు, ఐఆర్‌అండ్‌పీఆర్‌ భార్గవ్‌రెడ్డి తదితర ప్రతినిధుల బృందం విద్యార్థులను, ప్రిన్సిపల్‌, పీడీలను అభినందించారు.

డీఏవీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌

పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement