పీజీ డిప్లొమో కోర్సులలో నేరుగా ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

పీజీ డిప్లొమో కోర్సులలో నేరుగా ప్రవేశాలు

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

కడప ఎడ్యుకేషన్‌: యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) లోని జర్నలిజం, లలితకళల విభాగాలలో పలు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమో, సర్టిఫికెట్‌ కోర్సులలో నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు వర్సిటీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ సంచాలకులు ఆచార్య టి.లక్ష్మిప్రసాద్‌ తెలిపారు. జూలై 23వ తేదీ నుంచి ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. జర్నలిజం శాఖలో పబ్లిక్‌ రిలేషన్స్‌, తెలుగు జర్నలిజం..ఫైన్‌ ఆర్ట్స్‌ శాఖలో థియేటర్‌ ఆర్ట్స్‌, సర్టిఫికెట్‌ కోర్సులలో కూచిపూడి నృత్యం, కర్నాటిక్‌ మ్యూజిక్‌, కీబోర్డులలో ప్రవేశాలున్నాయన్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగష్టు 7వ తేదీ లోపు తమను నేరుగా సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని సూచించారు.

పీజీ కోర్సులలో లేటరల్‌ ఎంట్రీ

కడప ఎడ్యుకేషన్‌: నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి పీజీ కోర్సులలో నేరుగా ప్రవేశించే శ్రీలేటరల్‌ ఎంట్రీశ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకులు ప్రొఫెసర్‌ టి.లక్ష్మిప్రసాద్‌ తెలిపారు. జూలై 23వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు జరిగే ఈ ప్రవేశాలలో భాగంగా ఎంఏ (ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌), తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఎం.కాం, ఎంబీఏ, ఎంబీఏ (హెచ్‌ఆర్‌), ఎంసీఏ మరియు ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌, సైకాలజీ, బాటనీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నేరుగా తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ www.yvu.edu.in ను సందర్శించవచ్చని తెలిపారు.

ఈవీఎం గోడౌన్లనుపరిశీలించిన కలెక్టర్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : కలెక్టరేట్‌ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను గురువారం కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్‌ భద్రపరిచిన గోడౌన్ల పరిస్థితిని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టరేట్‌ ఏఓ గంగయ్య, హెచ్‌ సెక్షన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో పీఎఫ్‌ స్లిప్పులు

కడప సెవెన్‌రోడ్స్‌: వైఎస్సార్‌ జిల్లా పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సంబంధించిన 2013–14 నుంచి 2024–25 వరకు జెడ్పీ పీఎఫ్‌ స్లిప్పులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జెడ్పీ సీఈఓ సి.సుబ్రమణ్యం తెలిపారు. ఉద్యోగులు

https://zppfysrkadapa.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. స్లిప్పులలో ఏవైనా తప్పులుంటే, తగిన ఆధారాలతో జెడ్పీ కార్యాలయానికి వచ్చి సరిచేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement