కమలాపురం : కమలాపురం క్రాస్ రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో హెల్త్ సూపర్‌వైజర్ కొండారెడ్డి, స్టాఫ్ నర్సుల మధ్య సాగుతున్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తున్న నర్సు రమాదేవి మెడికల్ ఆఫీసర్ అనుమతితో సోమవారం లీవ్ తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన కొండారెడ్డి.. ‘లీవ్ ఇవ్వడానికి మెడికల్ ఆఫీసర్ ఎవరు? నన్ను అడిగే సెలవు తీసుకోవాలి‘ అంటూ నర్సుపై తీవ్రంగా రుసరుసలాడాడు. మంగళవారం దీనిపై వైద్య సిబ్బంది కొండారెడ్డిని నిలదీయగా.. ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ సిబ్బందితో పాటు మెడికల్ ఆఫీసర్‌ను కూడా బెదిరించినట్లు సమాచారం. తనకు రాజకీయ పలుకుబడి ఉందని, మహిళలని కూడా చూడకుండా కనీస మర్యాద ఇవ్వకుండా రెస్ట్ రూమ్‌లోకి రావద్దంటూ కొండారెడ్డి బెదిరిస్తున్నాడని నర్సులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎప్పుడూ తమ సెంటర్‌లోనే తిష్ట వేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల క్షేత్రస్థాయి విచారణ
ఆరోగ్య కేంద్రంలో గొడవ జరిగిన విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ ఆదేశాల మేరకు ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ ఆరిఫుల్లా, డీపీఎంఓ మహమ్మద్ తహ బుధవారం ఆసుపత్రిని సందర్శించి క్షేత్రస్థాయి విచారణ జరిపారు. సిబ్బందిని వేరువేరుగా విచారించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఇలా గొడవకు దిగడం సరికాదన్నారు. అడ్మినిస్ట్రేషన్ లోపం, లీవ్స్ లాంటి చిన్న చిన్న విషయాల వల్లే ఈ రగడ జరిగిందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని విచారణ అధికారులు స్పష్టం చేశారు.
నాయకుల అండతో నర్సులకు బెదిరింపులు


