గండి క్షేత్రానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

గండి క్షేత్రానికి విరాళం

Jul 1 2026 2:46 AM | Updated on Jul 1 2026 2:46 AM

చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి మంగళవారం రూ.75,232లు విరాళంగా వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ సి.విశ్వనాథ్‌ తెలిపారు. హైదరాబాదుకు చెందిన కె.మధుసూదనరెడ్డి బిడ్డలు వంశీధర్‌రెడ్డి,వర్షిని రూ.50,116లు, ప్రొద్దుటూరుకు చెందిన వేంపల్లె శివారెడ్డి కుమారుడు డాక్టర్‌ రామచంద్రారెడ్డి కోడలు దీప్తి రూ.25,116లు విరాళం అందజేశారని చెప్పారు. అలాగే ఆలయ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 15 గదులకు గాను రెండు గదులు అద్దెకు ఇచ్చామని... వాటి ద్వారా నెలకు రూ.12,500 చొప్పున ఆలయానికి ఆదాయం వస్తుందని వెల్లడించారు. ఆలయ చైర్మన్‌ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి చేపల వేట నిషేధం

– మత్య్సశాఖ డీడీ నాగయ్య

కడప అగ్రికల్చర్‌: జిల్లాలోని గండికోట, బ్రహ్మసాగర్‌ జలాశయాలు, సోమశిల వెనక జలాలలో జులై 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు(62 రోజులు) చేపల వేట పూర్తిగా నిషేధించినట్లు మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నాగయ్య తెలిపారు.చేపల సహజ సంతానోత్పిత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధించామని.. ఎవరైనా సంబంధిత జలాశయాలలో చేపట వేట నిర్వహించినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏపీ ఎంఐపీ ఇన్‌చార్జు పీడీగా మురళీమెహన్‌రెడ్డి

కడప అగ్రికల్చర్‌: ఏపీ ఎంఐపీ ఇన్‌చార్జు పీడీగా మురళీమోహన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఎంఐపీ పీడీగా పనిచేస్తున్న మన్నె వెంకటేశ్వరెడ్డి మంగళవారం ఉద్యోగ విరమణ చెందడంతో ఆయన స్థానంలో ఆదే కార్యాలయంలో అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న మురళీ మోహన్‌రెడ్డికి ఇన్‌చార్జు పీడీగా బాధ్యతలను అప్పగించారు. ఈమేరకు ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.

వ్యవసాయశాఖ డీడీగా

తంగెళ్ల వెంకటేష్‌

కడప అగ్రికల్చర్‌: వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా తంగేళ్ల వెంకటేష్‌ మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన మన్యం జిల్లా పార్వతిపురం అగ్రికల్చర్‌ ఏడీఏగా పనిచేస్తూ పదోన్నతిపై వైఎస్సార్‌జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటి డైరెక్టర్‌గా వచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ ఏడాది రుణ లక్ష్యం

రూ. 30,610 కోట్లు

– వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్‌

కడప అగ్రికల్చర్‌: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా 2026–27 సంవత్సరానికి రూ.30,610 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలో డీఆర్‌ ఓ మల్లికార్జునుడు,ఎల్‌డీఎం జనార్దనం,నాబార్డు డీడీఎం విజయ విహారి,కడప ఆర్‌డీఓ మురళీతో కలసి 2026–27 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ వార్షిక రుణ ప్రణాళిక ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనతోపాటు సమగ్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన పరపతి అందించేందుకు బ్యాంకులు చర్యలు చేపడతాయనివివరించారు.

‘ఎస్‌ఐఆర్‌’ను

సమర్థంగా పూర్తి చేయాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ పవన్‌ కుమార్‌శర్మ ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్‌ లో ఎక్కడా తప్పులు లేకుండా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనిపలు సూచనలు చేశారు. దీనికి కలెక్టర్‌ బదులిస్తూ జిల్లాలో 2252 బీఎల్‌ఓ లు ఉన్నారని,జిల్లా లో మొత్తం 18,96,231 ఓటర్లు ఉన్నారని, 97.67శాతం ఫారం పంపిణీ ప్రక్రియ జరిగిందని, 21.53శాతం డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు వివరించారు. వీసీలో టిఎస్‌ చేతన్‌,డీఆర్‌ఓ మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement