● ఎంతో లబ్ధి
ఉద్యమ దిశగా వైఎస్సార్‌సీపీ
సాక్షి ప్రతినిధి, కడప: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగంలోకి తెస్తూ, దుర్భిక్ష ప్రాంతాలైన ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటి భద్ర తను చేకూర్చాలనే మహత్తర లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి ఎత్తిపోతల పనులు నిలిపివేయంతో ఇక్కడి ప్రజానీకంలో తీవ్ర ఆందోళన, అభద్రత నెలకొంది.
● శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల స్థాయి నీటి మట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను రూ.3,825 కోట్లకు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసుకొని పనులు శరవేగంగా సాగాయి. ఎన్నికలకు ముందు దాదాపు 30శాతం పనులు పూర్తయ్యాయి. ఎన్నికలు పూర్తయ్యాక రాయలసీమ ఎత్తిపోతల పథకం మరుగున పడింది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ పథకాన్ని నిలిపివేయించినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కమారుగా చోటుచేసుకున్న అన్యాయంపై పలు రంగాలకు చెందిన నేతలు గళం విప్పారు.
ఎత్తిపోతల ఎందుకుంటే...
ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు–రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల కృష్ణా నీటిని తరలించుకు వెళుతోంది. అలాగే కల్వకుర్తిలో 25కుగాను 50 టీఎంసీలను తోడేస్తున్నారు. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతో ఇంతకముందున్న 60రోజుల వరద ప్రవాహం ప్రస్తుతం 30రోజులకు పడిపోయింది. రాయలసీమలోని ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 40 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీలు, చైన్నె తాగునీటికి 15 టీఎంసీలు, గాలేరు–నగరికి 38 టీఎంసీలు, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు చొప్పున నీరు అవసరమవుతుంది. కాగా, శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసుకునేందుకు వీలు ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల వద్ద అమర్చారు. అంటే శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగులకు దిగువన నీటి మట్టం ఉంటే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఒక్క నీటి చుక్క కూడా రాయలసీమకు చేరదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను ఆనుకుని ఈ ఎత్తిపోతల పథకం ఉంది. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్‌ఆర్‌ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేదీ ప్రభుత్వం జీఓఆర్‌టీ నంబరు 203 విడుదల చేసింది. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్‌లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 30 శాతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని జిల్లాల పరిధిలో దీని ఆవశ్యకతను వివరిస్తూ గళమెత్తారు. ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో కార్యాచరణ కోసం గ్రేటర్ రాయలసీమ పరిధిలోని అన్ని జిల్లాలకు చెందిన నాయకులు కడప కేంద్రంగా ఏకం కానున్నారు. మేడా ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి నేతృత్వంలో ఆదివారం సమావేశం కానున్నారు. ‘సీమ’కు ప్రాణపథమైన ఎత్తిపోతల పథకం సాధన కోసం భవిష్యత్ కార్యాచరణకు వైఎస్సార్‌సీపీ నడుం బిగించింది.
కృష్ణాలో తగ్గిన వరద నీటి రోజులు
అక్రమ ప్రాజెక్టులతోనీటిని తోడేస్తున్న తెలంగాణ
పోతిరెడ్డిపాడు ఒక్కటేనీటి అవసరాలు తీర్చలేదు
వైఎస్ జగన్ ముందుచూపుతోఎత్తిపోతలకు శ్రీకారం
రూ.3825 కోట్లతో పరిపాలన అనుమతి
బాబు అండ్ కో కుతంత్రాలతోఆగిన పనులు
పథకం సాధన దిశగాప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ
రేపు కడపలో రౌండ్ టేబుల్ సమావేశం
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే రాయలసీమ, నెల్లూరు జిల్లాలు పూర్తి స్థాయిలో సుభిక్షం అవుతాయి. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా రెండో దశలో ఉమ్మడి వైఎస్సార్ కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి– హంద్రీ–నీవా సుజల స్రవంతిని అనుసంధానిస్తూ పనులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించిన నీటిని గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా హంద్రీ–నీవా రెండో దశకు తరలించి, ఆ నీటిని నిల్వ చేసేందుకు ముదివేడు, నేతిగుంటపల్లి, అవులపల్లి వద్ద మూడు రిజర్వాయర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయకట్టుకు నీళ్లందించే పనులను వైఎస్ జగన్ సర్కార్ పరుగులెత్తించింది. ఈ పసులకు కూడా చంద్రబాబు సైంధువునిలా అడ్డుపడ్డారని రాయలసీమ వాసులు వాపోతున్నారు. రాయలసీమకు గణనీయమైన లబ్ధి చేకూరే పనిని అర్ధంతరంగా నిలబెట్టిన ఘనత చంద్రబాబు సర్కార్‌దే.
రాయలసీమ ప్రజల త్యాగాల పునాదుల మీద శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. కానీ 2004 వరకు ఆ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందిన జలాలు అంతంతమాత్రమే. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అసలు ఆచరణ సాధ్యమే కాదని కృష్ణస్వామి కమిషన్ ద్వారా చెప్పించారు. అప్పటి ఉద్యమాల ఫలితంగా చంద్రబాబు సర్కార్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దశాబ్దాలుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చోటుచేసుంటున్న అన్యాయాన్ని సరిచేసేందుకు 2004–05లో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులు డ్రా చేసుకునేందుకు వీలుగా విస్తరణ పనులను నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. రాజశేఖరరెడ్డి చరిత్రలో మిగిలిపోతారనే భయంతో అప్పట్లో చంద్రబాబు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని నిరసిస్తూ కోస్తాలో ప్రకాశం బ్యారేజీపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీ నేత నాగం జనార్ధనరెడ్డిలతో ధర్నాలు చేయించి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రకు పాల్పడ్డారు.
● ఎంతో లబ్ధి
● ఎంతో లబ్ధి


