కోతల నాయుడు | - | Sakshi
Sakshi News home page

కోతల నాయుడు

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

కోతల

కోతల నాయుడు

కోతల నాయుడు ● గత ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్లు

వృద్ధాప్య పింఛన్లు – 1,27,431

వితంతువు పింఛన్లు – 64,200

దివ్యాంగ పింఛన్లు – 36,609

అభయహస్తం పింఛన్లు – 6,922

చేనేత పింఛన్లు – 8,990

డప్పు కళాకారుల పింఛన్లు – 3,186

ఒంటరి మహిళల పింఛన్లు – 3,750

చర్మకారుల పింఛన్లు – 1,872

పెరాలసిస్‌ పింఛన్లు – 684

ట్రాన్స్‌జెండర్ల పింఛన్లు – 129

ఇతర పింఛన్‌దారులు – 1,956

మొత్తం – 2,55,719

సీఎం చంద్రబాబునాయుడువి అన్నీ కోతలే. మాటల్లో కోతలు... చేతల్లో కోతలు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛనూ మంజూరు చేయకపోగా.. ఉన్నవికూడా కోత కోసి కోతల‘నాయుడ’ని నిరూపించారు. దివ్యాంగులపై దయ లేదు. వృద్ధులపై కనికరమన్నదే లేదు..అవును..

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుకు‘పింఛన్‌’ఇద్దామనే ‘సామాజిక’స్పృహే లేదు.. బాబు సర్కారు కొలువుదీరాక ఒక్క పింఛన్‌ ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనం.

కాశినాయన: టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. బాబు సర్కార్‌ కొలువుదీరి 20 నెలలు దాటినా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకే మోక్షం దక్కలేదు. జిల్లాలో 2,55,719 పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లన్నీ గత ప్రభుత్వంలో మంజూరైనవే. కొత్తగా అర్హత కలిగిన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితోపాటు 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పింఛన్ల కోసం ఆశగా చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లు దాటినఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అర్హులైన పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ల కోసం వెబ్‌సైట్‌ తెరవకపోవడంతో అర్హులైన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

20 నెలలైనా తెరచుకోని వెబ్‌సైట్‌

ఎన్నికల నోటిఫికేషన్‌తో మూతపడిన వెబ్‌సైట్‌ కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇప్పటికీ తెరచుకోలేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక సచివాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

రీ వెరిఫికేషన్‌ పేరుతో పింఛన్ల తొలగింపు

కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు.. ప్రస్తుతం ఉన్న పింఛన్లను రీ వెరిఫికేషన్‌ పేరుతో ప్రభుత్వం తొలగిస్తోంది. అర్హులైన దివ్యాంగ పింఛన్‌దారులకు నోటీసులు ఇచ్చి రీ వెరిఫికేషన్‌కు కడప, ప్రొద్దుటూరుకు వెళ్లాలని సచివాలయాల ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 4వేల దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్‌ పేరుతో తొలగించారు. కొత్త పింఛన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ఉన్న పింఛన్లను తొలగించడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం భర్తకు పింఛన్‌ వస్తూ మరణిస్తే ఆ పింఛన్‌ భార్యకు అందిస్తున్నారు తప్ప కొత్త పింఛన్ల ఊసే లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి పింఛన్లు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

జిల్లాలో ప్రస్తుత పింఛన్ల వివరాలు

ఒక్క కొత్త పింఛనూ ఇవ్వని కూటమి సర్కారు..పైగా పింఛన్ల కోతలు

నేటికి అందుబాటులోకి రానిప్రభుత్వ వెబ్‌సైట్‌

అధికారుల చుట్టూ తిరుగుతున్న అర్హులు

తలలు పట్టుకుంటున్నసచివాలయ సిబ్బంది

టీడీపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

కోతల నాయుడు1
1/1

కోతల నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement