పాల కేంద్రాల్లో తనిఖీలు
ఒంటిమిట్ట: మండల పరిధి మృకుండాశ్రమం సమీపంలోని కడప–చైన్నె జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ పాల కేంద్రంలో శుక్రవారం కడప జిల్లా పశు సంక్షేమ సంవర్ధక శాఖ అధికారి(జేడీ) డాక్టర్ ఎన్.ఎ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల నాణ్యతను ఆయన పరిశీలించారు. పాలను కల్తీ కాని చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రజలు నాణ్యమైన పాలను గుర్తించడం నేర్చుకోవాలన్నారు. దానికి సంబంధించి కొన్ని చిట్కాలను ఆయన తెలిపారు. నీరు కలిస్తే త్వరగా జారి పోతాయన్నారు. పిండి కల్పిన పాలల్లో 2–3 చుక్కల అయోడిన్ ద్రవణం వేసి చూస్తే నీలి రంగు వస్తుందన్నారు. డిటర్జెంట్ కలిపి ఉంటే నురుగు ఎక్కువగా ఉంటుందన్నారు. యూరియా కలిస్తే కంది పప్పు వేసి బాగా కలిపితే పసుపు రంగు వస్తుందన్నారు. ఇలాంటి కల్తీల వల్ల మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట పశుసంక్షేవర్థక శాఖ ఏడీ డాక్టర్ ఉమా, ఒంటిమిట్ట పశు వైధ్యాధికారి డాక్టర్ స్వాతి, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


