కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
కడప కార్పొరేషన్: రాష్ట్ర విభజన నాటికి 2014 సంవత్సరం జూన్ 2కు ముందు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న ఉద్దేశంతో గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం యాక్ట్ నంబర్.30–2013ద్వారా వైద్య విధాన పరిషత్‌లోని 3వేల మందిని క్రమబద్దీకరించిందన్నారు. మిగతా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయడానికి వారి వివరాలన్నీ సేకరించిందని, ఆలోపే ఎన్నికలు రావడంతో వారిని రెగ్యులర్ చేయడం సాధ్యం కాలేదన్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో 5వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరణకు నోచుకోలేదన్నారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగులలాగే 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు.


