బద్వేలులో చోరీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని రిక్షాకాలనీలో బుధవారం మధ్యాహ్నం తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, 750 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3 వేలు నగదు చోరీకి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అట్లూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన బోవిళ్ళగోపాల్‌రెడ్డి కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. పిల్లల చదువు కోసం గత కొన్నేళ్లుగా పట్టణంలోని రిక్షాకాలనీలో నివసిస్తున్నారు. గోపాల్‌రెడ్డి కాంట్రాక్టు పనుల నిమిత్తం వైజాగ్‌కు వెళ్లగా ఇంటి వద్ద ఆయన భార్య ప్రభావతి, పిల్లలు ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రభావతి పిల్లలకు భోజనం ఇచ్చేందుకు పాఠశాల వద్దకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు వచ్చిన వెంకటపతి అనే వ్యక్తి కన్పించలేదని అతని భార్య అరుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగమురళి బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు కర్ణాటకలోని చిక్కబల్లాపుర్ జిల్లా నరమిద్దెపల్లి మండలంలోని జంగలపల్లి గ్రామానికి చెందిన వెంకటపతి కుటుంబ సభ్యలతో కలిసి ఈ నెల 14వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా పొలతలకు వచ్చి అక్కడ నుంచి బ్రహ్మగారిమఠం, కర్నూలు జిల్లాలోని అహోబిలానికి వెళ్లారు. ఈ నెల 18న ఎర్రగుంట్ల మండల పరిధిలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయానికి వచ్చారు. అనంతరం వెంకటపతి కనిపించలేదు. అతని కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం అరుణమ్మ ఎర్రగుంట్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


