రిమ్స్‌ మార్చురీలో మృతదేహం | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌ మార్చురీలో మృతదేహం

Feb 26 2026 7:40 AM | Updated on Feb 26 2026 7:40 AM

రిమ్స

రిమ్స్‌ మార్చురీలో మృతదేహం

కడప అర్బన్‌: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో బుధవారం అనారోగ్యంతో గుర్తు తెలియని వృద్ధురాలు చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో సంప్రదించాలని రిమ్స్‌ అధికారులు తెలియజేశారు.

వాహనం ఢీకొని

ఒకరికి గాయాలు

ముద్దనూరు: ముద్దనూరు–కడప రహదారిలో బుధవారం రాత్రి తిమ్మాపురం గ్రామ సమీపంలో టిప్పర్‌ వాహనం ఢీకొని స్కూటరిస్టుకు తీవ్రగాయాలయ్యాయి.కడపకు చెందిన సురేష్‌ తన భార్యతో కలిసి బైక్‌పై తాడిపత్రి నుంచి కడపకు బయలుదేరాడు.తిమ్మాపురం వద్ద నీళ్లు తాగడానికి బైక్‌ నిలబెట్టాడు.ఇంతలో టిప్పర్‌ వాహనం ఢీకొట్టింది..ఈ ఘటనలో సురేష్‌కు గాయాలవడంతో ఆపసుత్రికి తరలించారు.

రూరల్‌ సీఐపై

మరో కేసు నమోదు

పులివెందుల రూరల్‌ : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పులివెందుల రూరల్‌ సీఐ వెంకటరమణపై మరో కేసు నమోదైననట్లు ఎకై ్సజ్‌ సీఐ చెన్నారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏసీబీ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రూరల్‌ సీఐ వెంకటరమణ ఇళ్లల్లో సోదాలు నిర్వహించి 59 మద్యం బాటిళ్లను పట్టుకొని పులివెందుల ఎకై ్సజ్‌ కార్యాలయానికి పంపించినట్లు చెప్పారు. సాధారణంగా ప్రతి వ్యక్తి దగ్గర మూడు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువ ఉంటే ఎకై ్సజ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేస్తారన్నారు. అందులో భాగంగా పులివెందుల రూరల్‌ సీఐ వెంకటరమణ ఇంట్లో సుమారు వివిధ రకాలైన 59 మద్యం బాటిల్లు ఉండటంవల్ల ఎకై ్సజ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

రిమ్స్‌ సెక్యూరిటీ గార్డుపై దాడి: కేసు నమోదు

కడప అర్బన్‌: కడప రిమ్స్‌ ఆస్పత్రిలో సెక్యూరిటీగార్డ్‌ గా పని చేస్తున్న సిలారన్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రిమ్స్‌ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కడపకు చెందిన వల్లెపు శశికుమార్‌ తన భార్య వైద్య పరీక్షల కోసం స్కానింగ్‌ సెంటర్‌కు వెళ్లాడు. శశి కుమార్‌ భార్య స్కానింగ్‌ సెంటర్లకి వెళ్లడంతో లోపలికి తాను కూడా లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారు. దీంతో కోపంతో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

డెయిరీలపై అధికారుల దాడులు

మదనపల్లెటౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని డెయిరీలపై ఆహార భద్రత అధికారులు బుధవారం దాడులు జరిపారు. రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీపాల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇక్కడ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక బెంగుళూరు రోడ్డు, సీటీఎం రోడ్డు, ఇసుకనూతిపల్లెల వద్ద ఉన్న పాల డెయిరీలపై దాడులు జరిపి పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించామని అన్నమయ్య జిల్లా ఫుడ్‌ సేప్టీ అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రిమ్స్‌ మార్చురీలో మృతదేహం
1
1/1

రిమ్స్‌ మార్చురీలో మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement