ప్రకృతి ఒడిలో.. సేద్యం మడిలో | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో.. సేద్యం మడిలో

Feb 24 2026 7:18 AM | Updated on Feb 24 2026 7:18 AM

ప్రకృ

ప్రకృతి ఒడిలో.. సేద్యం మడిలో

ప్రకృతి వ్యవసాయం బలోపేతానికి

కేంద్రం అడుగులు

ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ స్కీ కింద జిల్లాలో 25 వేల మంది రైతులకు భూసార పరీక్షలు

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో ప్రకృతి వ్యవసాయం బలోపేతానికి మరో అడుగు పడింది. రైతులకు సాగులో ఖర్చు తగ్గించి మంచి దిగుబడి సాధించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి ఆయా భూముల్లో ఏయే లోపాలు ఉన్నాయో గుర్తించనున్నారు. అనవసరంగా ఎరువుల వాడకం, భూముల్లో సేంద్రియ కర్బనం గ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. భూమిలోని లోపాలకు అనుగుణంగా ఎరువులు వాడి రైతులకు ఖర్చు తగ్గించనున్నారు. భూముల్లో పచ్చిరొట్ట ఎరువులను పెంచి..వానపాములు అభివృద్ధికి కృషి చేయనున్నారు. ఆ దిశగా వ్యవసాయశాఖ, ప్రకృతిసేద్యం సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌) స్కిమ్‌ కింద మట్టి నమూనా సేకరణను జిల్లాలో నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 25 వేల మంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా ముందుగా కేటాయించిన 15038 మంది రైతులు భూముల్లో ప్రస్తుతం 12166 శ్యాంపిల్స్‌ సేకరించారు. మట్టి నమూనాల సేకరణ పూర్తికాగానే ఆ మండలానికి సంబంఽధించిన శ్యాంపిల్స్‌ను పరీక్షలకు పంపుతారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు శ్యాంపిల్స్‌ సేకరణ పూర్తయిన 8 మండలాలకు సంబంధించి 1811 శ్యాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు జిల్లా ప్రకృతి వ్యవసాయ సేద్యం డీపీఎం తెలిపారు.వీటిని ఊటుకూరు భూసార పరీక్షా కేంద్రంలో పరీక్షించి నివేదికను సంబందిత రైతులకు అందచేయనున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా 25 వేల మంది రైతులకు సంబంధించిన మట్టి నమూనాల సేకరించనున్నారు. సంబంధిత కార్యక్రమం మార్చి 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయశాఖలు కృష చేస్తున్నాయి.

ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ..

కడప ఊటుకూరు జిల్లా వనరుల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి మట్టి నమూనాల సేకరణపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో నుంచి మట్టి నమూనాలు సేకరించి కడప భూసార పరీక్ష కేంద్రం వారికి విశ్లేషణ చేయనున్నారు. ఈ మట్టి నమూనాల సేకరణలో సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా రైతు వివరాలను జియో కోఆర్డినేటర్లు నమోదు చేస్తారు. నివేదిక రాగానే వారికి తెలియజేస్తారు.

రైతులు ఏమి చేయాలంటే..

జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తూ మట్టి నమూనా పరీక్ష కోసం రైతులు ఆధార్‌కార్డు, పట్టాదార్‌ పాసుపుస్తకం, ఫోన్‌ నంబర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. పట్టాదార్‌ పాసు పుస్తకంతోపాటు ఆధార్‌కార్డును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. పై రెండింటిలో ఏది లేకపోయినా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం కుదరదు.

భూసార పరీక్ష లాభాలు ఇలా..

● పొలంలోని పోషక పదార్థాల(నేల సత్తువ) స్థాయి తెలుసుకోవచ్చు

● మట్టి పరీక్షా ఫలితాలను బట్టి నేలలకు ఏయే ఎరువులు ఎంత వాడలో తెలుసుకోవచ్చు

● ఎరువులపై అనవసరపు సాగు ఖర్చును తగ్గించవచ్చు

● నేల భౌతిక, రసాయన స్థితిని బట్టి ఆ నేలలు ఏ పంటల పండించడానికి అనుగుణంగా ఉంటాయో సూచించవచ్చు

● సాగుకు అనువుగా లేని నేలలు అంటే నేలలోని చౌడు, ఆమ్ల గుణాలను నిర్థారించి వాటిని సరి చేసే పద్ధతులను సిఫారసు చేయవచ్చు.

● సూక్ష్మ పోషకాల స్థాయిని కూడా తెలుసుకుని వాటిలో లోపాలను సరిచేయచవచ్చు.

● భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించకోవచ్చు.

● సేంద్రీయ పదార్థాల వినియోగాన్ని పెంపొందింవచ్చు

● పంట నాణ్యతను పెంచుకోవచ్చు.

● పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు.

● భూమిలో నత్రజని, భాస్వరం, పోటాష్‌ స్థాయిలను తెలుచుకోవచ్చు.

మార్చి చివరినాటికి

లక్ష్యం పూర్తి చేసేలా చర్యలు

జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 12166 మంది రైతులకు సంబంధించిన మట్టి నమూనాలను సేకరించాం. ఇంకా 2872 మందికి సంబంధించిన మట్టి నమూనాలను సేకరించాల్సి ఉంది. మార్చి చివరి నాటికి లక్ష్యం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.

– ప్రవీణ్‌కుమార్‌, ప్రకృతి వ్యవసాయ

జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌

ప్రకృతి ఒడిలో.. సేద్యం మడిలో1
1/2

ప్రకృతి ఒడిలో.. సేద్యం మడిలో

ప్రకృతి ఒడిలో.. సేద్యం మడిలో2
2/2

ప్రకృతి ఒడిలో.. సేద్యం మడిలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement