జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలో మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎక్కువ కేసులు డిస్పోజల్ చేయాలని సూచించారు. మండలాల వారీగా కేసుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబాఫకృద్దీన్, పాల్గొన్నారు.
అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య
రాయచోటి : పేదరికం, అనారోగ్యం ఆమెకు శాపమైంది. షేక్ రిహానా (40)కు పేదరికం పెనుభారంగా మారింది. భర్త కూలీ, నాలీ చేసి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారునితో కూడిన కుటుంబాన్ని పోషించడం గగనతరమైంది. ఇదే సమయంలో షేక్ రిహానా అనారోగ్యానికి గురైంది. మందులు కొనుగోలుకు ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతూ వచ్చాయి. కొన్ని నెలలు, సంవత్సరాలుగా వ్యాధిని దిగమింగుకుంటూ భర్తను, బిడ్డలను చూసుకుంటూ జీవనం సాగించింది. ఆర్థిక మార్గం దొరకక భర్త సంపాదన చాలక, తనలో ఉన్న వ్యాధిని భరించలేక దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకుంది. ఆదివారం రాత్రి ఇంటిలో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రాయచోటి పట్టణం సమీపంలోని కొలిమిమిట్ట (చిన్నముక్కపల్లి) ఏరియాలో చోటుచేసుకుంది. కొలిమి మిట్ట ఏరియాలోఇ షేక్ షపీ షేక్ రిహానాను ఇరవై సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉరివేసుకున్న విషయాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కొన్నేళ్లుగా వ్యాధిని తనలోనే భరిస్తూ వచ్చిన రిహానా విధిలేని పరిస్థితుల్లోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని బంధువులు, సమీప ప్రజలు చర్చించుకుంటున్నారు. సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌లు ఢీ: ఇద్దరికి గాయాలు
పుంగనూరు : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన కార్తీక్(24), కొత్తపేటకు చెందిన ఫిర్‌దోస్ (34) ద్విచక్రవాహనాల్లో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి


