పదో తరగతి విద్యార్థి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

Feb 24 2026 7:18 AM | Updated on Feb 24 2026 7:18 AM

పదో త

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

మైదుకూరు : మైదుకూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రిహాన్‌ అనే విద్యార్థి కనిపించడం లేదని తల్లి సబీనా తెలిపారు. స్థానిక సర్వాయ పల్లె రోడ్డుకు చెందిన రిహాన్‌ అదే రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.రోజులాగే సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం సబీనా భోజనం తీసుకొని పాఠశాలకు వెళ్లగా.. రిహాన్‌ ఉదయమే పాఠశాల నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తోటి విద్యార్థులు ఆమెతో చెప్పారు. తరగతి గదిలో టీచర్‌ కొట్టాడని కొందరు, మందలించాడని కొందరు పిల్లలు తనతో చెబుతున్నారని ఏం జరిగిందో తెలియడం లేదని సబీన కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడు పాఠశాల నుంచి బయటకు వెళ్లిన విషయం తాను భోజనం తీసుకొని వెళ్లేంతవరకు పాఠశాల యాజమాన్యం తనకు సమాచారం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

నిందితులను పట్టుకుంటాం

కాశినాయన : మండలంలోని గంగనపల్లె గ్రామానికి చెందిన కందుల దిలీప్‌ అనే యువకుడిపై పెట్రోలు పోసి నిప్పు అంటించిన వారిని అరెస్టు స్తామని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. సోమవారం సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న నాయునిపల్లి గ్రామానికి చెందిన యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు రెండు టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల, బద్వేలు సీఐలు హేమసుందర్‌, రామకృష్ణ, ఎౖస్‌ఐ యోగేంద్ర, పోలీసులు పాల్గొన్నారు.

రిమ్స్‌ మార్చురీలో

మృతదేహం

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : రిమ్స్‌ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10.35 గంటలకు ఒక వ్యక్తిని రిమ్స్‌కు తీసుకొచ్చారని, ఆయన చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుడి వయసు 62 సంవత్సరాలు ఉంటుందన్నారు, ఇతన్ని గుర్తిస్తే రిమ్స్‌ మార్చూరీలో సంప్రదించాలని కోరారు.

మద్యం మత్తులో కరెంట్‌ షాక్‌తో వృద్దుడు మృతి

లింగాల : లింగాల మండలం తేర్నంపల్లి గ్రామానికి చెందిన తొండూరు వీరప్ప (63) మద్యం మత్తులో కరెంటుషాక్‌కు గురై మృతి చెందాడు. చాకలి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరప్ప ఈనెల 22వ తేదీ రాత్రి 9 గంటలకు తీర్నాపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న ‘ధోబీఘాట్‌‘ వద్దకు దుస్తులు నానబెట్టడానికి వెళ్లాడు. అప్పటికే వీరప్ప అధిక మోతాదులో మద్యం తాగిన ఆయన అక్కడే ఉన్న మోటార్‌ స్టార్టర్‌ ను పట్టుకోగా కరెంటు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనను చూసినవారు మృతుని బంధువులకు సమాచారం తెలియజేశారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఆస్ప త్రికి తరలించారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

పదో తరగతి విద్యార్థి అదృశ్యం1
1/3

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

పదో తరగతి విద్యార్థి అదృశ్యం2
2/3

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

పదో తరగతి విద్యార్థి అదృశ్యం3
3/3

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement