జర్మనీ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌గా కృష్ణతేజా రెడ్డి
వేంపల్లె : వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన గడ్డం రామసుబ్బారెడ్డి కుమారుడు గడ్డం కృష్ణ తేజారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యూరప్ దేశాలలో భాగంగా జర్మనీ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌గా గడ్డం కృష్ణతేజారెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఆయన పార్టీకి ఎనలేని సేవలు అందించారని, ఇతర దేశాలలో పార్టీ కోసం ఎంతో శ్రమించారని, అందువల్ల ఆయనకు కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైఎస్సార్‌సీపీ యూరప్ కంట్రీస్ కన్వీనర్లలో భాగంగా గడ్డం కృష్ణ తేజారెడ్డికి జర్మనీ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని మాజీ సొసైటీ అధ్యక్షుడు వేంపల్లె చంద్రశేఖర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలతోపాటు కృతజ్ఞతలు తెలిపారు. జర్మనీ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌గా కృష్ణతేజారెడ్డికి పలువురు వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.


