ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది
చిన్ననాటి స్నేహితులను స్వయంగా కలుసుకోవడంలో ఉండే అనుభూతి మరెందులోను ఉండదనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలి అంటే ఎనబై ఏళ్లు పైబడిన వయసులో సుదూర ప్రాంతాలకు వెళ్లి చిన్ననాటి మిత్రులను ప్రతి ఏడాది ఒకచోట కలుసుకోవడం చాలా కష్టతరమైన పనే. అయినా మిత్రులను కలుసుకుంటున్నామన్న ఆనందం వల్ల శరీరం కూడా సహకరిస్తుందనిపిస్తుంది.
– ములక్కాయల జనార్దన్‌రెడ్డి,
రిటైర్డ్ ఆఫీసర్, రాజంపేట
వయసు పైబడే కొద్ది ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందువ ల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి స్నేహితులను కలుసుకుందామన్న ఆలోచనలు ఉన్నా శరీరం సహకరించక స్నేహితులను కలవలేని పరిస్థితి ఉంటుంది. అయితే మాకు ఎనిమిది పదుల వయసు దాటినా ప్రతి ఏడాది స్నేహితులను కలుస్తున్నాము. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. – బాలవీరారెడ్డి,
మాజీ వైస్ చాన్సలర్, బెంగుళూరు
ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది


