అంతర్‌ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌

Feb 21 2026 7:17 AM | Updated on Feb 21 2026 7:17 AM

అంతర్‌ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌

అంతర్‌ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌

ఇతర రాష్ట్రాల వ్యక్తులతో జాగ్రత్త

బురఖాల ముసుగులో

దోపిడీ, హత్య చేసేందుకు స్కెచ్‌

కుట్రను భగ్నం చేసిన పోలీసులు

కత్తులు, బురఖాలు, కారంపొడి స్వాధీనం

కడప అర్బన్‌ : కడప నగరంలో భారీ దొంగతనానికి ప్రయత్నించి.. అవసరమైతే హత్యలు చే సేందుకు సిద్ధమైన అంతర్‌ రాష్ట్ర దోపిడీ ముఠా ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడప టూటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలోని పోలీసులు.. నలుగురు అంతర్‌ రాష్ట్ర నిందితులను పట్టుకొ ని కటకటాల్లోకి నెట్టారు. కడప డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు టూ టౌన్‌ సీఐ ప్రసాద్‌ రావు, ఎస్సై రామకృష్ణతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటలకు కడప టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరి ధిలోని అయేషా వీధి, బెల్లం మండీ ప్రాంతంలో నేరానికి ముఠా సిద్ధమైనట్లు తెలిపారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా కడప నగరంలో ఊహించని ఘోరం జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఆ ఇంటిని దోపిడీ చేయడంతోపాటు ఇంట్లో ఉన్న వారందరినీ దారుణంగా హత్య చేయడానికి కూడా పథకం వేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. అరెస్ట్‌ అయిన వారిలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మురాదాబాద్‌ జిల్లా మొహల్లా గ్రామం అబ్దుల్లా బడా ప్రాంతానికి చెందిన షాకీర్‌ అలీ (25), మురాదాబాద్‌ జిల్లా ముండాపాండే, శివోరా బాజే గ్రామానికి చెందిన సుభాన్‌ అలీ అలియాస్‌ సులేమాన్‌ (24), మురాదాబాద్‌ జిల్లా ముండాపాండే, శివోరాబాజేకు చెందిన యూ సుఫ్‌ అలీ అలియాస్‌ జావీద్‌ (33), సంబల్‌ జి ల్లా సైదాపూర్‌ జాస్కోడికి చెందిన సులేమాన్‌ (34) ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి 4 ప దునైన కత్తులు, 2 నల్లని బురఖాలు, 2 జతల నల్లని చేతి గ్లౌజులు, 2 లేడీస్‌ బ్యాగులు, 2 జతల లేడీస్‌ చెప్పులు, అర కిలో కారంపొడి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

యజమానుల ఇంటికే కన్నం

షాకీర్‌ అలీ, సుభాన్‌ అలీ నాలుగేళ్లుగా కడప నగరంలోని అయేషా వీధిలో నివసిస్తూ, ఇంటర్నేషనల్‌ కల్యాణ మండపం పక్కన ఉన్న ఐకాన్‌ స్టైల్‌ హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లో హెయిర్‌ కటింగ్‌ మాస్టర్లుగా పని చేస్తున్నారన్నారు. వారి యజమాని సయ్యద్‌ జమీల్‌ అహ్మద్‌ కువైట్‌కు వెళ్లిన తర్వాత, అక్కడి కలెక్షన్‌ మొత్తాన్ని జమీల్‌ మేనల్లుడు పరాన్‌ నదీం ఖాన్‌కు అప్పగిస్తూ వుండేవారన్నారు. ఈ క్రమంలో జమీల్‌ ఇంట్లో అతని భార్య, తల్లి, మేనత్త, వదిన చిన్నపిల్లలు ఉంటారని పేర్కొన్నారు. ఇంట్లో బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంటాయని తెలుసుకున్న వా రు, తమ అవసరాల కోసం డబ్బు, బంగారు న గలను ఆ ఇంట్లో దొంగతనం చేసి, అనంతరం స్వగ్రామాలకు వెళ్లిపోవాలని పథకం వేసుకు న్నారన్నారు. ఈ నేరానికి తమకు ధైర్యం సరి పోదని భావించి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూ సుఫ్‌ ఆలీ అలియాస్‌ జావిద్‌, సుభాన్‌ ఆలీ అలియాస్‌ సులేమాలను పిలిపించారన్నారు. యూ సుఫ్‌ అలీపై ఉత్తరప్రదేశ్‌లో రెండు హత్య కేసు లు, సుభాన్‌ ఆలీ అలియాస్‌ సులేమాన్‌పై ఒక హత్యాయత్నం కేసు ఉన్నట్లు తెలిపారు. వీరి నేర అనుభవాన్ని ఉపయోగించుకుని పక్కా ప్రణాళిక రూపొందించారని వివరించారు.

పోలీస్‌ జీపు సైరన్‌ విని..

కడప నగరంలోని వై.వి.స్ట్రీట్‌లో కొనుగోలు చేసుకున్న వస్తువులతో ఇద్దరు ముందుగా సుభాన్‌ అలీ ఆ ఇంటి వద్దకు వెళ్లి మహిళలతో మాట్లాడుతుండగా, మిగతా ముగ్గురు వెనుక నుంచి ఇంట్లోకి చొరబడి మహిళల కళ్లలో కారంపొడి చల్లి, అడ్డం వస్తే కత్తులతో దాడి చేసి అవసరమైతే హత్య చేసి దోపిడీ చేయాలని ప్రణాళిక రూపొందించారన్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ ఆదేశాల మేరకు కడప డి.ఎస్‌.పి ఏ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో, పోలీస్‌ జీపు సైరన్‌ విని నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. నేర సామగ్రిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ నేర నియంత్రణలో కడప టూ టౌన్‌ సీఐ జి.ప్రసాద్‌ రావు, ఎస్సైలు రామకృష్ణ, మహమ్మద్‌ రఫీ, ఏఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సుధాకర్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు శ్రీహరి, శివయ్య, రామకృష్ణ, కానిస్టేబుళ్లు తులసి రామయ్య, చంద్రశేఖర్‌, మనీష్‌ పాల్గొన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా పనుల కోసం వచ్చే వారి పూర్తి వివరాలు సేకరించి, విచారణ అనంతరం మాత్రమే నియమించుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. విచారణ లేకుండా పనిలో పెట్టుకుంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. తమ వద్ద పని చేసే వారి వివరాలు తెలుసుకొని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంతర్‌ రాష్ట్ర ముఠాను సమయానికి పట్టుకోవడంతో కడప నగరంలో ఒక భారీ దోపిడీతోపాటు పలువురి హత్యలను నివారించగలిగామని డీఎస్పీ తెలియజేశారు. కడప టూటౌన్‌ పోలీసుల బృందాన్ని డీఎస్పీ, ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement