రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి

Feb 21 2026 7:17 AM | Updated on Feb 21 2026 7:17 AM

రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి

రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి

రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి

కడప అగ్రికల్చర్‌ : రైతుల అభ్యున్నతితోపాటు జిల్లా అభివృద్ధికి శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలని గుంటూరు ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ జి.శివ నారాయణ తెలిపారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం శాసీ్త్రయ సలహా సంఘ సమావేశంతోపాటు ఏరువాక కేంద్రానికి సంబంధించిన జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 2025 – 26 సంవత్సరానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం, సస్యరక్షణ, ఉద్యాన, పశువిజ్ఞానం, సామాజిక విజ్ఞానం విభాగాలతోపాటు ఏరువాక కేంద్రం చేపట్టిన సాంకేతిక, విస్తరణ కార్యక్రమాలపై చర్చించారు. అలాగే రాబోయే సంవత్సరానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాకు అవసరమైన పరిశోధనలు, విస్తరణ కార్యాచరణ కార్యక్రమాల అమలుకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. తిరపతి సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్‌.వి.సుమతి, కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ అంకయ్యకుమార్‌, ఏరువాక కేంద్రం సమన్వయకర్త క్రిష్ణప్రియ, కేవీకే శాస్త్రవేత్తలు, డాక్టర్లు శిల్పకళ, కె.సాయి మహేశ్వరి, మహేశ్‌బాబు, మానస, సురేశ్‌కుమార్‌రెడ్డి గత సంవత్సంలో చేపట్టిన పరిశోధన, విస్తరణ పురోగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి జి.ప్రభాకర్‌రెడ్డి, డీటీసీ ఉపసంచాలకులు యం.నాగరాజ, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, కేవీకే, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement