బీసీలను దగా చేసిన చంద్రబాబు
2026–27 బడ్జెట్‌లో చంద్రబాబు బీసీలను దగా చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు బీసీల్లోని 130 కులాలకు 50 ఏళ్లకే పింఛన్, సబ్సిడీ రుణాలు వంటి హామీలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి బీసీలతో ఓట్లు వేయించుకుని రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. వరుసగా మూడో బడ్జెట్‌లో కూడా బీసీల పథకాలకు సంబంధించి రూపాయి కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది చంద్రబాబు బీసీలను ఎంత దగా చేస్తున్నారో. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, విద్యాదీవెన, వసతి దీవెన సకాలంలో చెల్లించక విద్యకు దూరమవుతున్నారు. – నేట్లపల్లె శివరాం, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం, మైదుకూరు.
బీసీలను దగా చేసిన చంద్రబాబు


