కడప, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–12 సౌత్‌జోన్ అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గురువారం వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఆ జట్టులోని మనీష్ సాయి 27, గౌరీష్ 26 పరుగులు చేశారు. కడప జట్టులోని భాను వర్షిత్‌రెడ్డి 2, వివాన్స్ రెడ్డి 2, సాయి చరిత్2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన కడప జట్టు 24.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆ జట్టులోని యం గురు ఈక్షిత్ 36, హరి శ్రీయాన్ 22 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని గౌరీష్ 2 వికెట్లు తీశారు.
మహ్మద్ నవాజ్
(88 పరుగులు)
సుచిత్‌రెడ్డి
(5 వికెట్లు)
కడప, నెల్లూరు జట్ల విజయం


