మోసం చేయడం చంద్రబాబు నైజం
మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50ఏళ్లకే పింఛన్ ఇస్తానని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాడు. రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఆ పథకం దారిదాపుల్లో లేదు. ఈసారైనా బడ్జెట్ కేటాయిస్తారని చాలా మంది లబ్ధిదారులు ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే మిగిల్చింది. మరోసారి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. ఈ పథకం అమలుకు ఏటా రూ.9600కోట్లు అవసరం కాగా, మూడేళ్లలో రూ. 28,800 కోట్లు లబ్ధిదారులకు ఎగ్గొట్టారు.
– పి. చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు
మోసం చేయడం చంద్రబాబు నైజం


