24 గంటల్లో కథ ముగిసింది | - | Sakshi
Sakshi News home page

24 గంటల్లో కథ ముగిసింది

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 9:53 AM

24 గం

24 గంటల్లో కథ ముగిసింది

24 గంటల్లో కథ ముగిసింది

మదనపల్లె: ఒక ఘటన రెండు చావులు..విధి విచిత్రమో, కర్మ సిద్దాంతమో కాని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై నీటి డ్రమ్ములో ముంచి చంపిన కర్కోటకుడైన మానవ మృగం కులవర్దన్‌ కూడా 24 గంటల్లో మరణించాడు. కులవర్ధన్‌ మృతదేహం చెరువులో కనిపించిందన్న వార్త బుధవారం ఉదయమే వ్యాపించడంతో మదనపల్లె ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. బాలిక నివసించిన ప్రాంతంలో యువకులు టపాసులు కాల్చి సంబరాలు చేశారు. బాలిక అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం జరిగింది

కులవర్ధన్‌ మరణంతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగింది. అయితే ప్రజల ఆందోళనతో న్యాయం జరగదని అనుకున్నాం. కానీ కర్మ వెంటాడింది. –ఎస్‌.లక్ష్మిదేవి, మదనపల్లె

పండగలా ఉంది

ప్రజలు, పోలీసుల భయంతోనే కులవర్దన్‌ను దేవుడే శిక్షించాడు. ఈ ప్రాంత మహిళల్లో భయం తొలగింది. మాకు పండగలా ఉంది.

–ఎం.ప్రభావతి, మదనపల్లె

ధర్మం గెలిచింది

బాలిక హత్య ఘటనతో ఆవేశం కట్టలు తెంచుకుంది. న్యాయం కోసం ఎండలో ఆందోళన చేశాం. అన్నం, నీళ్లు లేకుండా ఆందోళన చేశాం. చివరకు ధర్మం గెలిచింది. –సరస్వతి, మదనపల్లె

చిన్నారిపై అఘాయిత్యం, హత్య జరిగిన మరుసటిరోజే హంతకుడి మరణం

మదనపల్లెలో ప్రజల సంబరాలు

24 గంటల్లో కథ ముగిసింది 1
1/3

24 గంటల్లో కథ ముగిసింది

24 గంటల్లో కథ ముగిసింది 2
2/3

24 గంటల్లో కథ ముగిసింది

24 గంటల్లో కథ ముగిసింది 3
3/3

24 గంటల్లో కథ ముగిసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement