శివరాత్రి ఆదాయం రూ.1.11కోట్లు | - | Sakshi
Sakshi News home page

శివరాత్రి ఆదాయం రూ.1.11కోట్లు

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 9:53 AM

శివరాత్రి ఆదాయం రూ.1.11కోట్లు

శివరాత్రి ఆదాయం రూ.1.11కోట్లు

శివరాత్రి ఆదాయం రూ.1.11కోట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలి మధ్యాహ్న భోజన నాణ్యతపై శ్రద్ధ

కడప కోటిరెడ్డి సర్కిల్‌: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి వివిధ శైవ క్షేత్రాలకు 1317 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 1,46,077కి.మీ తిప్పడం ద్వారా రూ.1,11,31,086ల ఆదాయం ఒనగూరిందని కడప జిల్లా ప్రజా రవాణా అధికారి పోలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆదరించి ఆదాయం రావడానికి తోడ్పడిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని బోర్డ్‌ రూమ్‌ హాల్లో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలో పలు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలు, హోటల్స్‌, స్ట్రీట్‌ ఫుడ్‌ వద్ద ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడం ద్వారా కలుషిత ఆహారంతో ఎదురయ్యే సమస్యల నుంచి ప్రజలను కాపాడవచ్చునని తెలిపారు.

పరిశ్రమల్లో భద్రతా చర్యలను

పటిష్టం చేయాలి

పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ిపీజీఆర్‌ఎస్‌ హాలులో జిల్లా క్రైసిస్‌ గ్రూప్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

చాపాడు: మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో భోజన నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌ తెలిపారు. మండల కేంద్రమైన చాపాడులోని జీఏ ఎస్‌ హైస్కూల్‌, ఉర్దూ హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూడు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించి నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చొరవ తీసుకోవాలని ఎంఈఓలకు సూచించారు. ఎంఈఓలు రవిశంకర్‌, వంశీకృష్ణ, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement