నేటి నుంచి శనగల కొనుగోలు
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరతో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా గురువారం నుంచి శనగలను కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. జేసీ నిధి మీనాతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గురువారం నుంచి పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దు టూరు, కమలాపురంలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో మరో 15 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సేవా కేంద్రాల్లో రిజిష్టర్ చేసుకుంటే ఏరోజు మార్కెట్‌కు శనగలు తీసుకురావాలో మెసేజ్ వస్తుందన్నారు. ఈ–క్రాప్ బుకింగ్‌ను అనుసరించి రైతుల అకౌంట్లలోకే డబ్బు జమ చేస్తామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ, మార్క్‌ఫెడ్, సహకారశాఖల అధి కారులు చంద్రానాయక్, పరిమళజ్యోతి, వెంకట సుబ్బయ్యలు పాల్గొన్నారు.
మాతా శిశు మరణాల నివారణకు చర్యలు
మాతా శిశు మరణాల నివారణకు గైనకాలజిస్టులు శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ అండ్ రెస్పా న్స్ కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.


