ఉత్కంఠ భరితంగా బండలాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ భరితంగా బండలాగుడు పోటీలు

Feb 18 2026 7:16 AM | Updated on Feb 18 2026 7:16 AM

ఉత్కంఠ భరితంగా బండలాగుడు పోటీలు

ఉత్కంఠ భరితంగా బండలాగుడు పోటీలు

రాజంపేట రూరల్‌ : రాజంపేట మండలంలోని అత్తిరాలలో జిల్లా స్థాయి బండలాగుడు పోటీలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 5 జతల ఎడ్లు పాల్గొన్నాయి. అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన కోనపల్లే ఇంద్రారెడ్డి ఎడ్లు 20 నిమిషాలలో 710 అడుగులు బండలాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.50 వేలు దక్కించుకున్నాయి. వేముల మండలం రంగోరిపల్లి గ్రామానికి చెందిన మూలే జస్విత్‌రెడ్డి ఎడ్లు 676 అడుగులు లాగి రూ.40 వేలు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నాయి. పులింవెందుల మండలం ఎర్రిపల్లి గ్రామానికి చెందిన కాకర్ల విజయ్‌కుమార్‌రెడ్డికి చెందిన ఎడ్లు 600 అడుగులు బండలాగి మూడవ స్థానంలో నిలిచి రూ.30 వేలు దక్కించుకున్నాయి. నంద్యాల జిల్లా డోన్‌ మండలం మాల్యాల గ్రామానికి చెందిన షేర్‌ మహిమున్నా ఎడ్లు 459 అడుగులు లాగి నాల్గవ స్థానంలో నిలవడంతో రూ.20 వేలు దక్కించుకున్నాయి. కొండాపురం మండలానికి చెందిన బెడదూరు గ్రామానికి చెందిన ప్రణయ్‌ ఎడ్లు 389 అడుగులు లాగి ఐదవ స్థానంలో నిలిచి రూ.10 వేలు దక్కించుకున్నాయి. పోటీలలో పాల్గొన్న పోటీదారులకు మెదటి బహుమతిని రైల్వేకోడూరు మండలం ఓబనపల్లికి చెందిన గడికోట వేంకటేశ్వర్లునాయుడు రూ.50 వేలు, రెండవ బహుమతి రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన వల్లూరు రమేష్‌రెడ్డి రూ.40 వేలు, మూడవ బహుమతి ఇసుకపల్లి గ్రామానికి చెందిన అద్దెపల్లి ప్రతాప్‌రాజు రూ.30 వేలు, నాల్గవ బహుమతిగా నందలూరు మండలానికి చెందిన రేవూరు వేణుగోపాల్‌ రూ.20 వేలు, ఐదవ బహుమతిగా మందరం రాచపల్లి గ్రామానికి చెందిన ముప్పాల శంకరరాజు రూ.10 వేలు బహుమతిగా వితరణ చేశారు. ఈ పోటీలను మన్నూరు సీఐ ఎస్‌.లింగప్ప పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్ర జలు తరలివచ్చారు. కార్యక్రమంలో మన్నూరు, సుండుపల్లి ఎస్‌ఐలు ఎం.వేంకటేశ్వర్లు, ఎస్‌.హుస్సేన్‌సాహెబ్‌, ఏఎస్‌ఐలు సీ.ఎస్‌.కే. ప్రసాద్‌వర్మ, ఎస్‌. ఖాసింబ్‌సాబ్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ ఎస్‌.షామీర్బాషా, వి.తిరుపతయ్య, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement