బాధితులకు న్యాయం చేయలి
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్ : బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 100 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌న్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ ఎన్. సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.


