ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువత | - | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువత

Jan 29 2026 6:29 AM | Updated on Jan 29 2026 6:29 AM

ఏపీపీ

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ

పేదరికం వెక్కిరిస్తున్నా..

కష్టాలు ఎక్కిళ్లు తెప్పిస్తున్నా

వారు వెనకడుగు వేయలేదు..

‘పుస్తకాన్నే’ సమస్తంగా మార్చుకుని..

అందులోని పాఠాన్నే ఇష్టంగా మలుచుకుని

రాత్రింబవళ్లు మనసు పెట్టి చదివారు...

సాధనే సోపానంగా చేసుకుని..

విజయమే లక్ష్యంగా పైకెదిగారు.

సంకల్ప బలం ఉండాలేగానీ సాధించలేనిది

ఏదీ లేదని నిరూపించిన విజేతలు వారు..

బుధవారం విడుదలైన గ్రూప్‌–2 ఫలితాల్లో

‘కొలువులు’ సాధించి స్ఫూర్తిగా నిలిచారు.

ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన పాలగిరి వెంకట సుబ్బారెడ్డి కుమారుడు పాలగిరి విజయసింహారెడ్డి జూనియర్‌ అసిస్టెంట్‌గా విజయం సాదించారు. సివిల్స్‌ సాదించడమే తన లక్ష్యమని వెల్లడించారు.

బ్రహ్మంగారిమఠం మండలంలోని టి.చౌదరవారిపల్లెకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు లెక్కల నారాయణరెడ్డి కుమారుడు లెక్కల రమణారెడ్డి గ్రూప్‌2లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

కడప సెవెన్‌రోడ్స్‌/కడప ఎడ్యుకేషన్‌: పట్టుదల, ప్రణాళికబద్ధమెన కృషి ఉంటే ఎంతటి ఉన్నత లక్ష్యాన్నైనా సాధించగలమని జిల్లా యువత మరోమారు రుజువు చేసింది. బుధవారం విడుదలైన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు. పలువురు ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో చాలామంది సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాలు, ఇతర చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిలో మహిళలు గణనీయ సంఖ్యలో ఉండడం విశేషం. జిల్లాలోని కడప, ఖాజీపేట, జమ్మలమడుగు, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ పరీక్షలో తమ ప్రతిభ చాటారు.

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ1
1/3

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ2
2/3

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ3
3/3

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement