వివాహేతర సంబంధాలను గోప్యంగా ఉంచమన్న పార్టీ జనసేన
రాజంపేట రూరల్ : వివాహేతర సంబంధాలను గోప్యంగా ఉంచుకోండి అని దేశంలోనే తమ కార్యకర్తలకు బహిరంగంగా లేఖ రాసిన ఏకై క పార్టీ జనసేన పార్టీ అని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ ఎద్దేవా చేశారు. స్థానిక కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గొంగడిలో అన్నం పెట్టుకొని వెంట్రుకలను ఏరినట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిప్పటి నుంచి రాష్ట్రంలో ఎదో ఒక చోట మహిళల పట్ల అఘాయిత్యాలను చూడటం మన దౌర్భాగ్యమన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగింక దాడి బహిర్గ తం కావటం బాధాకరమన్నారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు ఇలాంటి నీచ చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. నోరు విప్పితే తాట తీస్తా, తోలు తీస్తా అని మాట్లాడే జనసేనాని పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన తప్పును ఏ విధంగా సరి చేస్తారోనని ప్రజలు ఎదరుచూస్తున్నారన్నారు. మహిళా ఉద్యోగి గర్భిణి అయితే అబార్షన్ చేయించటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. జనసేనాని పవన్‌కల్యాణ్ బాటలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ బాధిత మహిళా ఉద్యోగిని వివాహం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆమెకు న్యాయం చేసి మహిళ పట్ల పవన్‌కల్యాణ్ తన నిబద్ధత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.


