వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : వక్ఫ్ సవరణ చట్టంను పా ర్లమెంటు ఆమోదించడాన్ని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శనివారం కడప నగరంలోని అజ్మత్ షాది ఖానాలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల ప్రకారం లౌకిక ప్రజాస్వామ్యవాదులతో రౌండ్ టేబుల్ సమావేశం అహ్మద్ బాబు బాయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు చంద్రశేఖర్, చంద్ర, ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు మతాల మధ్య విభజన పెంచి, దేశ లౌకిక స్వభావాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని నూతనంగా ఏర్పాటైన వక్ఫ్ పరిరక్షణ కమిటీ (జేఏసీ) తీర్మానించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సత్తార్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర నాయకుడు ఇషాక్ అలీ, ఎస్‌డీపీఐ నాయకుడు తాహీర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తహీర్ మిగతా మండల వారీగా ఎన్నుకోవడం జరిగిందన్నారు, నగర కమిటీని ఎన్నుకున్నారు.


