పండగ వెలుగు
పల్లెకు
హరివిల్లులోని వర్ణాలన్నీ ఒక్కటై ముంగిట ముగ్గులై వాలిపోయాయి..
వీధి చివర చిట్లాకుప్ప
వెలుగులు నింగినంటాయి..
ఊరూరా సాంస్కృతిక కార్యక్రమాలు కోలాహలంగా సాగాయి..
ఊరూ..వాడా ఒక్క చోట చేరిన క్షణం ముచ్చట్లలో మునిగిపోయాయి..
వెరసి.. తెలుగు లోగిళ్లలోపండగ కళ ఉట్టి పడింది..
కర్షకుడి నేస్తమైన బసవన్న ముస్తాబై ఘల్లుఘల్లుమంటూ అడుగేయగా...
కొత్త డ్రస్సులు ధరించిన బుడతలు బుడి బుడి అడుగులేస్తూ సందడి చేశారు.
పసందైన వంటకాలతో...
పార్వేట ఉత్సవాలతో..
ఊరూరా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.
ఇష్టదైవం పార్వేటకు వెళ్లగా..
భక్తజనం తోడుగా బయలుదేరింది..
గ్రామోత్సవంలో ఇంటివద్దకొచ్చిన కోదండరాముడిని..
కొబ్బరికాయ కొట్టి మనసారా వేడుకుంది..
ఇక...
కనుమ రోజు మందు బాబులు మందేస్తూ.. చిందులేయగా..
పచ్చ నేతలు పండగ మూడు రోజులూ కోడి పందేల్లోనే మునిగి తేలారు..
ఎర్రగుంట్లలో అలరించిన కోలాటం
పండగ వెలుగు
పండగ వెలుగు
పండగ వెలుగు


