●వైభవంగా కోదండ రాముని పార్వేట ఉత్సవం
ఒంటిమిట్ట: ఏకశిలానగరి ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం పరంధాముడి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. కనుమ పండుగను పురస్కరించుకొని టీటీడీ ఆలయ స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవెలలో శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించా రు. అలాగే సమీప నాగేటి తిప్పపై ఉన్న పార్వేట మండపం వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి పార్వేట ఉత్సవాన్ని ఆలయ సంప్రదాయల పరంగా నిర్వహించారు.
అనంతరం స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు.టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


