కిలో చికెన్ @ 300
రాజంపేట టౌన్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్ ధర చుక్కలు చూపించింది. కోడిమాంసం ధర కొండెక్కి కూర్చుంది. తొలిసారి 300 మార్కు దాటి రికార్డు సృష్టించింది. గత నెలలో కిలో స్కిన్‌లెస్ చికెన్ 220 రూపాయిలు ఉండగా ప్రస్తుతం 300 రూపాయలకు చేరింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు చికెన్ టేస్ట్ చాలా కాస్ట్‌లీ అయిపోయింది. పండుగ కావడంతో ప్రజలు చికెన్‌ను కొనక తప్పలేదు.
● ఉత్పత్తి తగ్గడం వల్లే ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఒకవైపు ఉత్పత్తి తగ్గడం మరోవైపు వినియోగం ఎక్కువ కావడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు భోగి, కనుమ పండుగ రోజున ఎక్కువ స్థాయిలో ప్రజలు చికెన్‌ను కొనుగోలు చేయనున్నందున అమాంతంగా ధర 300కు చేరింది.


