యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం
కడప ఎడ్యుకేషన్ : కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో యోగి వేమన విశ్వవిద్యాలయంకు స్వర్ణ పతకం లభించింది. విద్యార్థి డి.మురళీకృష్ణ 59 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు. యోగి వేమన విద్యాలయానికి ఈ పతకం ఐదవది. గత ఏడాది విశ్వవిద్యాలయానికి బంగారు పతకం సాధించడంతో వైవియూ క్రీడా బోర్డు ద్వారా రూ.30 వేల క్యాష్, ప్రతినెలా పదివేల రూపాయల పారితోషకం అందజేశారు. తద్వారా మంచి పోషకాలతో ఆహారం తీసుకోవడంవల్ల తాజాగా బంగారు పతకాన్ని డి.మురళీకృష్ణ సాధించారు. మురళీకృష్ణ ఈ పోటీల్లోనే కాక అంతర్జాతీయ క్లాసికల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ప్రపంచ రికార్డు సాధించడం గమనార్హం. ఈ పథకం సాధించిన అతడిని ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, కులసచివులు ఆచార్య పుత్తా పద్మ, ప్రధానాచార్యులు ఆచార్య ఎస్ రఘునాథరెడ్డి, క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ కే రామసుబ్బారెడ్డి, వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల విభాగ సిబ్బంది అభినందనలు తెలియజేశారు
59 కేజీల విభాగంలో పతక సాధించిన
విద్యార్థి మురళీకృష్ణ


