జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం
కడప అర్బన్ : మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శమని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు కొనియాడారు. పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీఈ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ పూలే సామాజిక తత్వవేత్తగా సమాజంలో అనేక విధాలుగా ప్రజలను చైతన్యం పరిచారని, ప్రజలలో అనాదికాలంగా పాతుకుపోయిన వివక్షలను నిర్ములించుటకు తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. వితంతు పునర్వివాహం గురించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడని, ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య గారు, ఏ.ఆర్ డి.ఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్.ఐ లు ఆనంద్, టైటాస్, వీరేష్,శ్రీశైల రెడ్డి, శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు


