పనులు త్వరగా పూర్తిచేయాలి
జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి
సిద్దవటం : ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని సిద్దవటం మండలం లోని కడప– చైన్నె ప్రధాన రహదారికి ఇరువైపులా పారుశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆమె భాకరాపేట, కనుమలోపల్లె గ్రామాల్లో జరిగే పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ విజయ భాస్కర్, ఈఓపీఆర్‌డీ మోహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, శివయ్య పాల్గొన్నారు.


