
టపాకాయలు స్వాధీనం
వీరపునాయునిపల్లె : మండల కేంద్రంలోని ఫ్యాన్సీ స్టోర్‌లో ఆదివారం రూ.50 వేల విలువగల టపాకాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. వీరపునాయునిపల్లెకు చెందిన జనార్దన్‌గుప్తా అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌బి హెడ్‌కానిస్టేబుల్ చలమారెడ్డి, సిబ్బంది తనిఖీలు నిర్వహించారన్నారు. టపా కాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
యువకుడు మృతి
గోపవరం : మండలంలోని రాచాయపేటలో గుర్తుతెలియని యువకుడు ఆదివారం తెల్లవారు జామున మృతిచెందాడు. శనివారం రాత్రి వర్షం కురవడంతో అతడు చెట్టు కింద నిలబడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. తెల్లవారి చూసే సరికి చెట్టు కింద ఉన్న బెంచీపై విగతజీవిగా పడి ఉన్నాడు. అతడి వద్ద సెల్‌ఫోన్, ఇతర ఆధారాలు లేకపోవడంతో స్థానికులు బద్వేల్ రూరల్ ఎస్‌ఐ రవికుమార్‌కు సమాచారం అందజేశారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉండవచ్చని, జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ధరించి ఉంటాడని, ఆచూకీ తెలిస్తే ఎస్‌ఐ రవికుమార్ సెల్ నెంబర్ 9121100628కు సమాచారం ఇవ్వాలన్నారు.
రెండు దుకాణాల్లో రూ.70వేలు చోరీ
రామాపురం : మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో శనివారం రాత్రి రెండు దుకాణాల్లో రూ.70 వేలు చోరీ చేసినట్లు ఎస్‌ఐ వి.ఎల్.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోలీసులు వివరాల మేరకు.. లక్కిరెడ్డిపల్లె క్రాస్ రోడ్డు లోని ఆర్‌ఎంపీ వైద్యులు గంప వెంకటరమణ మెడికల్ షాప్, బాదుల్లాకు చెందిన స్వీట్ బేకరీ షాప్ తాళాలు పగులగొట్టి దుండగులు లోపలికి చొరబడి రూ.70 వేలు చోరీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి త్వరలోనే ఆరెస్టు చేస్తామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

టపాకాయలు స్వాధీనం