
నేత్రపర్వంగా స్వాతినక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వాతినక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున వైకుంఠద్వారం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శ్రీస్వామి వారి పాదాల వద్ద, వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెట్ల మార్గంలో వెళ్లి శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఆలయ ముఖమండపంలో స్వాతిహోమం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. ఆ తరువాత పంచామృతాలు, శుద్ధ జలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపిన బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం నిర్వహించారు.

నేత్రపర్వంగా స్వాతినక్షత్ర పూజలు