ఉంగుటూరులో జనసేనకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఉంగుటూరులో జనసేనకు షాక్‌

Oct 22 2026 1:15 AM | Updated on Oct 22 2026 1:15 AM

వైఎస్సార్‌సీపీలోకి రామాని సుబ్రహ్మణ్యం

ఉంగుటూరు : ఉంగుటూరు మండల కేంద్రంలో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత రామాని సుబ్రహ్మణ్యం బుధవారం జనసేనకు గుడ్‌బై చెప్పి, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి వాసుబాబు ఆహ్వానించారు. గతంలో కష్టకాలంలో జనసేన తరఫున ఎంపీటీసి స్థానానికి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడంతోనే తాను జనసేనను వీడినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఉంగుటూరు–1 ఎంపీటీసీ స్థానానికి రామాని సుబ్రహ్మణ్యం భార్య వెంకట సాయిలక్ష్మిని, ఉంగుటూరు–2 ఎంపీటీసీ స్థానానికి సందడి సాయి భార్య దేవిని అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మరడా మంగారావు, రాష్ట్ర కార్యదర్శి ఎలిశెట్టి పాపారావు బాబ్జీ, పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రంగు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసి పెనుగొండ బాలకృష్ణ, సందక రాంబాబు, పత్తిపాటి దుర్గం, దోసనపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement