న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో మహిళలకు అందించిన సాయం
గత ప్రభుత్వంలో రూ.615.15 కోట్ల ఆర్థిక సాయం
బ్యాంకుల నిరాకరణ.. షూరిటీ ఉంటేనే లోన్లు
కార్పొరేషన్ రుణాల పేరిట మరో మోసం
శురకవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026
భీమవరం(ప్రకాశం చౌక్): డ్వాక్రా సంఘాల సృష్టికర్తగా చెప్పుకునే చంద్రబాబునాయుడి పాలనలో మహిళలు నిరంతరం మోసపోతూనే ఉన్నారు. గత 2014 ప్రభుత్వ కాలంలో బంగారు రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి చివరకు మహిళలను మోసం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేస్తామని, ఉపాధి–వ్యాపారాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తా మని హామీలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా మహిళలకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. ఈ పాలనలో మహిళా సాధికారత అనే మాటే వినిపించడం లేదు. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వ ఆర్థిక సాయంతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో డ్వాక్రా మహిళలు అనేక వ్యాపారాలు ప్రారంభించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక మద్దతు లేకపోవడం, బ్యాంకు రుణాలు దొరక్కపోవడంతో పెట్టుబడుల కొరత ఏర్పడి మహిళలు తమ వ్యాపారాలను మూసేసుకుంటున్నారు. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు సాగిస్తున్నారు.
నిలిచిపోయిన ‘సీ్త్ర నిధి’ రుణాలు
చిన్నపాటి వ్యాపారాల పెట్టుబడి కోసం మహిళలు సీ్త్రనిధి రుణాలను ఆశ్రయిస్తుంటే అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో, పట్టణాల్లో సీ్త్ర నిధి రుణాలు మంజూరు కావడం లేదు. గతంలో జరిగిన కొన్ని అవకతవకలను సాకుగా చూపిస్తూ ఈ రుణాలను పూర్తిగా నిలిపివేశారు.
పెట్టుబడుల కోసం మహిళల ఎదురుచూపులు
కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెట్టుబడి లేక, ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహిళా సాధికారత అంటే కేవలం మాటలు కాదు, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ప్రధాన ఆశయం కావాలి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తరహాలోనే వ్యాపారాల కోసం ఆర్థిక సాయం అందించి, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే.. పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవించగలుగుతారు.
పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో)
చేయూత 1,12,017 168.00
కాపు నేస్తం 1,95,728 366.47
చేదోడు 29,102 29.10
ఈబీసీ నేస్తం 25,457 38.18
బ్యాంకు రుణాలు 15,000 75.00
అందని ఆర్థిక ప్రోత్సాహకాలు
నిలిచిన ఉపాధి వ్యాపారాలు
సీ్త్ర నిధి రుణాల్లేవు
మహిళా సంక్షేమం మరిచిన కూటమి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.615 కోట్ల లబ్ధి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో రూ.615.15 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల మహిళలకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధంగా (ఉచితంగా) ఆర్థిక సాయం అందించారు. ఆ నిధులతో మహిళలు చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకుని సొంతంగా ఉపాధి పొందారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో మహిళలకు పైసా సాయం కూడా చేయలేదు.
జిల్లాలో 30,093 డ్వాక్రా సంఘాల్లో 3,00,990 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకులు గ్రూపులపై ఇచ్చే సాధారణ డ్వాక్రా రుణాలు తప్ప, మహిళల సొంత ఉపాధి కోసం కనీసం రూ.25 వేల అప్పు కూడా ఇవ్వడం లేదు. ఏదైనా షూరిటీ (హామీ) ఉంటేనే లోన్ ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతుండటంతో పేద, మధ్యతరగతి మహిళలకు బ్యాంకు అప్పు దొరకడం లేదు. ఫలితంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించలేక మహిళలు ఉపాధికి దూరమవుతున్నారు.
కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తామని ప్రకటించడంతో.. జిల్లాలో దాదాపు 10 వేల మంది మహిళలు కిరాణా, వస్త్ర, టైలరింగ్, బ్యూటీషియన్, ఫుడ్ బిజినెస్ వంటి వివిధ వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి నాయకుల సిఫార్సులు, ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు సబ్సిడీ సొమ్ము జమ చేయలేదు. ఏడాదన్నర దాటినా ఈ సబ్సిడీ రుణాలు మంజూరు కాకపోవడంతో మహిళలు మరోసారి మోసపోయారు.


