తాడేపల్లిగూడెం: ఆసియా బ్రౌన్ బొవేరీ (ఏబీబీ) సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన ఏబీబీ యాక్సిలరేటర్–2026 జాతీయస్థాయి పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని డైరెక్టర్ ఎన్‌వీ రమణరావు, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా 1,600కు పైగా జట్లతో పాటు 14 వేల మంది విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో తమ విద్యార్థులు ప్రాజెక్టుతో ప్రతిభ కనబర్చి రూ.1.50 లక్షల నగదు పురస్కారం అందుకున్నారన్నారు. అసోసియేట్ డీన్ పెద్దపాటి శంకర్ టీమ్ మెంటర్‌గా వ్యవహరించారన్నారు. .
ప్రాజెక్ట్ అ‘ద్వితీయ’ం
నిట్‌లో మూడో సంవత్సరం చదువుతున్న సౌమ్యదీప్‌దాస్, బి.కిసాన్ (ఈఈఈ), శివమ్‌కుమార్ (మెకానికల్), ఆర్యన్ శ్యామ్ (సీఎస్‌ఈ) బృందం బియాండ్ మానిటరింగ్ ఏఐ ఏజెంట్స్ ఫర్ రియల్ టైమ్ పాడ్ రీసోర్స్ డిస్కవరీ అండ్ డిపెండెన్సీ మ్యాపింగ్ పేరుతో వినూత్న ప్రాజెక్టును రూపొందించారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా క్లౌడ్ వాతావరణంలో పనిచేస్తున్న అతి చిన్న కంప్యూటింగ్ వనరులను తక్షణమే గుర్తించడం, వాటి పరస్పర ఆధారిత సంబంధాలను విశ్లేషించడం ప్రాజెక్టు ప్రత్యేకత.


