214 అర్జీల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

214 అర్జీల స్వీకరణ

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

214 అర్జీల స్వీకరణ చట్ట పరిధిలో పరిష్కారం ఏపీఏఐఎంఎస్‌ ద్వారా పారదర్శక సేవలు నేడు మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ గోదారమ్మకు పంచ హారతులు

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లో అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కా రం చూపాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు, కేఆర్‌ఆర్‌ ప్రాజెక్టు అధికారి పి.ప్రభాకర్‌తో కలిసి ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని, ఒకే సమస్యపై పునరావృతంగా అర్జీలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో 160, రెవెన్యూ క్లినిక్‌లో 54 అర్జీలు స్వీకరించారు. జిల్లా అధికారులు, వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్‌ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

భీమవరం : ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 19 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలపై పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీవీఎన్‌ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలో సార్వా సీజన్‌ నుంచి వ్యవసాయశాఖ అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అ గ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీఏఐఎంఎస్‌) సేవలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఓ ప్రకటనలో కోరారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్‌ దిశగా తీసుకెళ్లడానికి, వేగంగా, పారదర్శక సేవలు అందించేందుకు ఏపీఏఐఎంఎస్‌ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఏపీఏఐఎంఎస్‌ నమోదు చేయించుకోవడం ద్వారా పథకాల అమలు, ఇన్‌పుట్‌ సబ్సి డీ, పంటల వివరాల ధ్రువీకరణ, పంటల కొ నుగోలు వంటి సేవలను సులభంగా పొందే అవకాశముందన్నారు. జిల్లాలో రైతుంతా తప్పనిసరిగా సమీప రైతు సేవా కేంద్రం, వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ పంట వివరాలను ఏపీఏఐఎంఎస్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో దివ్యాంగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మంగళవారం భీమవరంలోని ఆర్‌ఆర్‌డీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎనిమిది కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, దాదాపు 200కు పైగా ఉద్యోగావకాశాలు ఉ న్నాయన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 95020 24765లో సంప్రదించాలని కోరారు.

పెనుగొండ: ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం సిద్ధాంతంలో హిందూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వశిష్టా గోదావరికి పంచ హారతులు సమర్పించారు. కలగభద్రుడు స్వామి బ్రహ్మత్వంలో కంచర్ల నరసింహమూర్తి, మహాలక్ష్మీ దంపతలు గంగ పూజలు నిర్వహించి నదీమతల్లికి హారతులు ఇచ్చారు. హిందూ ధర్మపరిరక్షణ సమితి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement