సర్టిఫికెట్ల జారీలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల జారీలో జాప్యం

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

సర్టిఫికెట్ల జారీలో జాప్యం

మీ సేవా కేంద్రాల్లో స్టేషనరీ కొరత

ఈనెల 10 నుంచి నిలిపివేసిన సర్టిఫికెట్‌ పేపర్లు

భీమవరం : మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలకు అవసరమైన పేపర్‌ కొరతతో సర్టిఫికెట్ల జా రీలో ఆలస్యమవుతోంది. దీంతో విద్యార్థులు, ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు పలు రకాల సర్టిఫికెట్ల అవసరం ఉంటుంది. అయితే ప్రభుత్వం నూతనంగా మీ సేవా కేంద్రాలకు సరఫరా చేసే సర్టిఫికెట్‌ పేపర్లను మార్పు చేయడంతో సమస్య తలెత్తింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రా మ–వార్డు సచివాలయ శాఖ పేరుతో పేపర్‌ను స రఫరా చేయగా కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖగా మార్చివేసింది. జిల్లాలో 120 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. కుల, ఆదాయ, ఈ డబ్ల్యూఎస్‌, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అవసరమైన అడంగల్‌, బీ–1, పోలీసు సర్టిఫికెట్స్‌ వంటివి మీ సేవా కేంద్రాల ద్వారా ఇస్తుంటారు. ఇందుకు అవసరమైన పేపర్‌ను రూ.3.34కు ప్రభుత్వం మీ సేవా కేంద్రాలకు సరఫరా చేస్తోంది. మీ సేవా నిర్వాహకులు ఇండెంట్‌ పెట్టి సొమ్ము చెల్లిస్తుంటారు. గతంలో పెద్ద మొ త్తంలో సొమ్ములు చెల్లించి సర్టిఫికెట్‌ పేపర్‌ను తెప్పించుకోగా ప్రస్తుతం అరకొరగా మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోందని మీ సేవా నిర్వహకులు చెబుతున్నారు. వీరవాసరం మండలంలోని ఓ మీ సేవా కేంద్రంలో 20 రోజులుగా కుల, ఆదా య సర్టిఫికెట్స్‌ కోసం 40 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేకపోయామని నిర్వాహకుడు తెలిపారు.

పేరు మార్పుతో ఇబ్బందులు

సర్టిఫికెట్లకు సంబంధించి పాత పేపర్లు బదులుగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖగా మార్పు చేసి వాటిని వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇ చ్చింది. ఈనెల 10న పాత సర్టిఫికెట్‌ పేపర్లను స్వా ధీనం చేసుకుంది. ఇకపై కొత్త పేపర్లపై మాత్రమే సర్టిఫికెట్లను ప్రింట్‌ చేసి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సమస్య తలెత్తింది. సర్టిఫికెట్‌ కోసం మీ సే వా కేంద్రాలకు వెళితే పేపర్‌ లేదంటూ సమాధానం వినిపిస్తోంది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు జనన, కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్‌ వంటి సర్టిఫికెట్లు అవసరం పడింది. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతున్నాయి. దీంతో ఆయా సర్టిఫికెట్ల కోసం కేంద్రాలకు క్యూకడుతున్నా రు. ఈ నేపథ్యంలో పేపర్‌ కొరతతో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు కేంద్రాల చుట్టూ తిరిగినా సర్టిఫికెట్లు మంజూరు చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ఆలస్యమైతే విద్యాసంస్థల్లో ఇబ్బందులు తప్పవని విద్యార్థులు, అర్హత కోల్పోతామని పింఛన్‌ లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement