బెల్ట్‌ షాపు నిర్వాహకుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపు నిర్వాహకుడి అరెస్ట్‌

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

పాలకోడేరు: భీమవరం ప్రోహిబిషన్‌, ఎకై ్సజ్‌ స్టేషన్‌ అధికారులు సోమవారం గొరగనమూడిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న గొరగనమూడి గ్రామానికి చెందిన జి.ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్‌ ఇన్స్‌పెక్టర్‌ కె. బలరామరాజు స్పష్టం చేశారు. అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడేవారిపై నిఘా కొనసాగిస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement