పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ఆక్వా రైతులు తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ రోడ్డు ఎక్కినా, ఫీడ్ కంపెనీలు ససేమిరా అంటూ వారి ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నా,యి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం సభ్యులు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం ఆక్వా ఫీడ్ డీలర్లు స్వచ్చందంగా బంద్ పాటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యకు ఫీడ్ డీలర్లు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలపాలని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు పిలుపు మేరకు ఫీడ్ డీలర్లు ఈ బంద్ పాటిస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని సముదాయించి వారి పోరాటాన్ని అణగదొక్కుతున్నారే తప్ప ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లపై మాత్రం చర్యలు చేపట్టడం లేదని అన్నారు .కూటమి ప్రభుత్వానికి అధికారం చేతిలో ఉండి కూడా రైతుల పక్షాణ నిలబడి ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లపై అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం చేతగానితనం అర్ధమవుతుందని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెంచిన ధరలో రూ. 4 లు తగ్గించాలని ప్రభుత్వం సూచించినా, హెచ్చరికలు జారీచేసినా డోంట్‌కేర్ అన్నట్లు వ్యవహరించాయంటే ప్రభుత్వం చేతగానితనమా అని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. నేటి బంద్‌తో రాష్ట్ర ప్రభుత్వంలో కధలిక వస్తుందా లేదా అని ఆక్వా రైతులు వేచి చూస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా ఫీడ్, మెడిసిన్ షాపులు బంద్ కొనసాగుతుందన్నారు


