పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

Feb 9 2026 8:27 AM | Updated on Feb 9 2026 8:27 AM

పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

తణుకు అర్బన్‌: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు సూచించారు. తణుకులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌ జేఈఈ పరీక్షల్లో తమ విద్యా సంస్థలో ప్రతి ఐదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందని చెప్పారు. మెడికల్‌లో తమ సంస్థలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందని వివరించారు. సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌ రష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌మోడల్‌గా ఉండాలని కోరారు. పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్‌.మురళీకృష్ణారెడ్డి, సంతోషి, విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సతీష్‌బాబు, తణుకు కాలేజ్‌ ప్రిన్సపాల్‌ కె.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement