పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు

Feb 9 2026 8:27 AM | Updated on Feb 9 2026 8:27 AM

పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు

పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు

పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు

తణుకు అర్బన్‌: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన దువ్వ గ్రామ పరిధిలోని జాతీయరహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కుటుంబ సభ్యు లు బొమ్మిడిలో ఫంక్షన్‌ చూసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. దువ్వ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి కారు పిల్లకాలువలోకి జారిపోయింది. కారులో జంగారెడ్డిగూడెం ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ విప్పర్తి అశోక్‌కుమార్‌తో పాటు కుటుంబసభ్యులు వీరవల్లి సురేంద్ర, నరేంద్ర, పల్లెకొండ ప్రవీణ్‌, వీరవల్లి చంద్రమౌళి, 8 సంవత్సరాల బాలిక విప్పర్తి అస్మిత ఉన్నారు. పిల్ల కాలువ , నీరు తక్కువగా ఉండడంతో వీరంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని 108 వాహనంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటనపై ఏ ఫిర్యాదు రాలేదని రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement