అంతర్వేది ఉత్సవాలకు పెరిగిన రద్దీ
నరసాపురం: అంతర్వేది ఉత్సవాలకు సంబంధించి నరసాపురంలో గురువారం రద్దీ మరింత పెరిగింది. స్వామి పవిత్ర రథోత్సవం నేఫధ్యంలో యాత్రికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెల్లవారుజామున కల్యాణ మహోత్సవాన్ని తిలకించి వెనుదిరిగిన భక్తులతో పట్టణంలో గోదావరి పంటురేవు వద్ద రద్దీ నెలకొంది. భక్తుల సౌకర్యార్థం 3 పంటులు ఏర్పాటు చేశారు. ఇక స్టీమరన్‌రోడ్డు పొడవునా అంతర్వేది యాత్రికులకు పలు స్వచ్ఛంధ సంస్థలు, రాజకీయ పార్టీల వారు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. వన్నెంరెడ్డి శ్రీనివాస్, గుగ్గిలపు మురళి, బళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితివారు మజ్జిగ పంపిణీ చేశారు.
అంతర్వేది ఉత్సవాలకు పెరిగిన రద్దీ


