ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
పెదవేగి : రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డీఏలను వెంటనే ప్రకటించి, సీపీఎస్‌ను రద్దు చేయాలని, 12వ పీఆర్‌సీ కమిటీ నియమించాలని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెదవేగి మండలం నందు వివిధ పాఠశాలలను ఆయన సందర్శించి మాట్లాడారు. హామీల సాధన కోసం ఎస్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే దశల వారీ పోరాటంలో ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు బీ మహేష్, ఎండీ షఫీయుద్దిన్, పెదవేగి మండల అధ్యక్షుడు పి నాగార్జున, ప్రధాన కార్యదర్శి టి ప్రవీణ్ కుమార్, నెరుసు శ్రీనివాస్, వీ అమృత్, టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


