రాజ్యాంగ విలువలు పరిరక్షించాలి
ఏలూరు టౌన్: దేశ రాజ్యాంగ విలువలకు ప్రాముఖ్యత ఇస్తూ ప్రజాసేవలో పోలీసుల పాత్ర కీలకమైందని, దేశ సమైక్యతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఏలూ రు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. సో మవారం ఏలూరు రేంజ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యాన్ని స్థాపించి ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అందించిన గొప్ప రాజ్యాంగం మన సొంతం అన్నారు. అలాగే ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కేపీ శివకిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ అభివృద్ధికి, సమగ్రతకు, శాంతియుత జీవనానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏఆర్ ప్రధాన కార్యాలయంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా జెండా వందనం చేశారు. ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, ఆర్‌ఐలు పవన్‌కుమార్, సతీష్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


