వెళ్లి రావమ్మా.. గంగానమ్మ | - | Sakshi
Sakshi News home page

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ

Jan 27 2026 9:48 AM | Updated on Jan 27 2026 9:48 AM

వెళ్ల

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరం జనసాగరాన్ని తలపించింది. మూడు నెలల పాటు విశేష పూజలందుకున్న నగర ఇలవేల్పు, కొంగు బంగారం గంగానమ్మవారి జాతరలో భాగంగా సోమ వారం భారీ ఊరేగింపులు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేడల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు, చీరలు, రవికలు, పసుపు, కుంకుమలను భక్తులు సమర్పించారు.

ఏడేళ్లకోసారి..

ఏడేళ్లకోసారి (పుట్టింటికి) నగరానికి విచ్చేసే అమ్మవారు పూజలు అందుకుని సోమవారం నగరాన్ని వీడుతుండగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, లక్ష్మీవారపుపేట, పవర్‌పేట, ఆదివారపుపేట ప్రాంతాల్లో కొలుపులు అందుకున్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. కాగా నగరంలోని పడమరవీధి, తంగెళ్లమూడి ప్రాంతాల్లో కొలుపులు కొనసాగుతున్నాయి. పడమరవీధిలో అమ్మవారికి వచ్చేనెల 1న, తంగెళ్లమూడిలో అమ్మవారికి 8న నైవేద్యాలు సమర్పించనున్నారు.

కొర్లబండ్లపై ఊరేగింపులు

అమ్మవార్ల ఊరేగింపును అత్యంత పవిత్ర కార్యంగా భక్తులు భావిస్తారు. ఒకే వేప చెట్టు నుంచి తీసిన కలపతో కొర్లబండిని తయారుచేయించి పంబలవారి రూపంలో అమ్మవారిని కూర్చోబెట్టి యాత్ర ప్రారంభించారు. యాత్రలో అమ్మవారి అక్కాచెల్లెళ్లు కూడా వచ్చి చేరి కాలక్షేపం చేస్తారనే నమ్మకంతో వారి కోసం ప్రత్యేకంగా పీటలు, కోలాటం కర్రలు కూడా ఏర్పాటుచేశారు.

దారి పొడవునా.. కొర్లబండ్లపై అమ్మవార్ల ఊరేగింపు ప్రారంభమైనప్పటి నుంచి ఊరి పొలిమేరల వరకూ సాగనంపేందుకు భక్తులు పోటెత్తారు. దారి పొడవునా భక్తులు నీరాజనాలు అర్పించారు. దారులన్నీ జనాలతో నిండిపోయాయి. ఊరేగింపును తి లకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవార్ల ఊరేగింపులో డీజేలు, బాణసంచా కా ల్పులు, శక్తివేషాలు, కోలాటాలు ప్రత్యేకంగా నిలి చాయి. ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన రూట్‌ మ్యాప్‌ల మీదుగా ఊరేగింపులు జరిగాయి. ఎటువంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో నిరంతరం నిఘా పెట్టారు. ఎక్కడా ట్రా ఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు.

ఏలూరులో జన జాతర

నగర ప్రజల ఘన వీడ్కోలు

అడుగడుగునా నీరాజనం

కొర్లబండ్లపై భారీ ఊరేగింపులు

ఐదు ప్రాంతాల్లో జాతర సందడి

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ 1
1/3

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ 2
2/3

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ 3
3/3

వెళ్లి రావమ్మా.. గంగానమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement