దేశానికి దిక్సూచి రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

దేశానికి దిక్సూచి రాజ్యాంగం

Jan 27 2026 9:48 AM | Updated on Jan 27 2026 9:48 AM

దేశాన

దేశానికి దిక్సూచి రాజ్యాంగం

దేశానికి దిక్సూచి రాజ్యాంగం కొత్త రావిచర్ల సర్పంచ్‌కి పురస్కారం ఏఎస్పీ సుస్మిత ప్రతిభ అంతర్వేది ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

భీమవరం: భారత రాజ్యాంగం దేశానికి దిక్సూ చి అని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. సోమవారం స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌ భవనంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగం (సంక్షిప్తంగా) అనే పుస్తకాన్ని మోషేన్‌రాజు, బాలల కోసం భారత రాజ్యాంగం ప్రవేశిక అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ఆవిష్కరించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి మోషేన్‌ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.క్రాంతికుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సరళంగా, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా రాసిన లక్ష్మణరావును అభినందించారు. దేశంలో విభి న్న జాతులు, సంస్కృతులు ఉన్నా అందరూ ఐక్యంగా ఉన్నారంటే అది రాజ్యాంగం గొప్పతనమన్నారు. పుస్తక రచయిత కేఎస్‌ లక్ష్మణ రావు, మంతెన సీతారాం, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌, టి.సురేష్‌, పీఎస్‌ విజయరామరాజు, బి.వాసుదేవరావు, కె.క్రాంతిబాబు, జె.రామలక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు: మండలంలోని కొత్త రావిచర్ల సర్పంచ్‌ కాపా శ్రీనివాసరావు రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారం అందుకున్నారు. ఉత్తమ పంచాయతీగా కొత్త రావిచర్ల, ఉత్తమ సర్పంచ్‌గా కాపా శ్రీనివాసరావు ఎంపిక కావడంతో ఆయనకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో ఆయన్ను సత్కరించి మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కారాన్ని అందజేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం దిశగా అంకితభావంతో పనిచేస్తున్న వారికి ఇచ్చే ఈ పురస్కారం శ్రీనివాసరావుకు దక్కడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధానిలో పురస్కారం అందుకోవడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. తన బాధ్యత మరింత పె రిగిందని, కొత్త రావిచర్ల అభివృద్ధికి, ప్రజల సే వకు నిరంతరం కట్టుబడి ఉంటానని అన్నారు.

ఏలూరు టౌన్‌: అమరావతిలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్‌.సుస్మితకు అరుదైన అవకాశం లభించింది. పోలీస్‌ పరేడ్‌లో ఆమె సారథ్యం వహిస్తూ కమాండెంట్‌గా వ్యవహరించారు. ఐపీఎస్‌ అధికారిగా శిక్షణా కాలంలోనూ ఆమె కమాండెంట్‌గా ప్రతిభ చాటుకోగా తాజాగా మరోసారి కవాతులో నాయకత్వం వహిస్తూ ఉన్నతాధికారుల అభినందనలు అందుకున్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, డీజీపీ హెచ్‌కే గుప్తా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఈనెల 28, 29వ తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌వీఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆయా బస్‌స్టేషన్ల నుంచి ప్రతి 30 నిమిషాలకు బస్సు ఉంటుందన్నారు. భీమవరం నుంచి 20, నరసాపురం నుంచి 5, పాలకొల్లు నుంచి 20, మ చిలీపట్నం నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపు తున్నామన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం దిండి–చించినాడ బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అనుమతిచ్చారన్నారు.

దేశానికి దిక్సూచి రాజ్యాంగం 1
1/2

దేశానికి దిక్సూచి రాజ్యాంగం

దేశానికి దిక్సూచి రాజ్యాంగం 2
2/2

దేశానికి దిక్సూచి రాజ్యాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement